Adilabad: ఆభరణాల దుకాణంలో మహిళల చేతివాటం.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆభరణాల దుకాణంలో ముగ్గురు మహిళలు వెండి పట్టీలను చాకచక్యంగా చోరీ చేశారు. పట్టణంలోని ఓ నగల దుకాణానికి వచ్చిన మహిళలు.. వెండి పట్టీలు చూపించాలని అడిగారు. షాపు యజమాని పట్టీలు చూపిస్తున్న క్రమంలో.. వాటిని కొట్టేశారు.

Published : 23 Jun 2024 15:33 IST

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆభరణాల దుకాణంలో ముగ్గురు మహిళలు వెండి పట్టీలను చాకచక్యంగా చోరీ చేశారు. పట్టణంలోని ఓ నగల దుకాణానికి వచ్చిన మహిళలు.. వెండి పట్టీలు చూపించాలని అడిగారు. షాపు యజమాని పట్టీలు చూపిస్తున్న క్రమంలో.. ముగ్గురు మహిళల్లో ఒకరు పట్టీలు పరిశీలిస్తున్నట్లు నటిస్తూ.. వాటిని కింద పడేశారు. తర్వాత కిందపడేసిన పట్టీలను మరో మహిళ చీరలో దాచుకుంది. ఆ తర్వాత అక్కడ పట్టీలు నచ్చడంలేదని మరో దుకాణానికి వెళ్లారు. పట్టీలు చోరీ జరిగినట్టు షాపు యజమాని గ్రహించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు