Bapatla: వైకాపా కౌన్సిలర్‌ దౌర్జన్యం.. ఆర్‌ఎంపీ నుంచి బంగారం, ఆస్తి లాక్కొని..

అధికార మదంతో ఆర్‌ఎంపీ వైద్యురాలిని బెదిరించి ఒంటిపై బంగారం, ఆస్తిపత్రాలు లాక్కున్న వైకాపా కౌన్సిలర్‌ను తెనాలి మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 18 Jun 2024 13:54 IST

అధికార మదంతో ఆర్‌ఎంపీ వైద్యురాలిని బెదిరించి ఒంటిపై బంగారం, ఆస్తిపత్రాలు లాక్కున్న వైకాపా కౌన్సిలర్‌ను తెనాలి మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలోని బాలాజీరావుపేటలో జయశ్రీ అనే వైద్యురాలు ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తోంది. ఓ మహిళకు చికిత్స విషయంలో పొరపాటు జరిగిందని తనను బెదిరించి అనుచరులతో కలిసి వైకాపా కౌన్సిలర్ రహ్మత్ బేగ్ దాడి చేశారని జయశ్రీ ఆరోపించారు. రూ.40లక్షలు డిమాండ్ చేసి అప్పటికప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కున్నారని బాధితురాలు ఆరోపించారు. డబ్బులు లేవంటే ఇంటి పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు. ఇన్నాళ్లు మౌనంగా జయశ్రీ ప్రభుత్వం మారడంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపా కౌన్సిలర్ రహ్మత్ బేగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని