YSRCP: వెలుగులోకి వైకాపా అక్రమాలు

గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Published : 19 Jun 2024 17:06 IST

గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు నివ్వెరపరుస్తోంది. వైకాపా కోసం పని చేసిన కొన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు అందాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్దఎత్తున నియామకాలు జరిగాయి. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వైకాపాకు అనుకూలంగా పని చేసే వ్యక్తులు.. ఉద్యోగులుగా చోటు సంపాదించారు. వీరిలో చాలా మంది అసలు ఆఫీసుకే వెళ్లలేదు. అయినా ఠంచనుగా వైకాపా సర్కారు వీరికి జీతాలు చెల్లించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు