Yoga Day: నీటిలో యోగాసనాలు నేర్పిస్తూ అబ్బురపరుస్తున్న సైకాలజిస్ట్

యోగాసనాలు నీటిలో వేస్తూ అబ్బురపరుస్తున్నాడు జగిత్యాలకు చెందిన ఓ సైకాలజిస్ట్. 24 ఏళ్లుగా మెట్‌పల్లిలో సిద్ధ సమాధి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ రాజా రత్నాకర్ శిక్షణ ఇస్తున్నాడు.

Published : 21 Jun 2024 15:52 IST

యోగాసనాలు నీటిలో వేస్తూ అబ్బురపరుస్తున్నాడు జగిత్యాలకు చెందిన ఓ సైకాలజిస్ట్. 24 ఏళ్లుగా మెట్‌పల్లిలో సిద్ధ సమాధి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ రాజా రత్నాకర్ శిక్షణ ఇస్తున్నాడు. నీటిలోనే శవాసనం, తాడాసనం, సూర్య నమస్కారాసనం, పద్మాసనం, వృక్షాసనం ఇలా వివిధ రకాల ముద్రాసనాలు నేర్పిస్తున్నాడు. యోగా  ద్వారా అనేక రుగ్మతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని రాజరత్నాకర్ అన్నారు. యువకులు, విద్యార్థులు జలయోగపై ఆయన వద్ద ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నారు.

Tags :

మరిన్ని