YS Jagan: కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి..!: వైరల్‌గా వైఎస్‌ జగన్‌ కామెంట్స్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మాట్లాడుతున్న తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అయితే, మామూలుగా ట్రోలింగ్ చేయడం లేదు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

Updated : 13 Jun 2024 18:47 IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ (YS Jagan) మాట్లాడుతున్న తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అయితే, మామూలుగా ట్రోలింగ్ చేయడం లేదు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయింది’’ అని జగన్‌ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Tags :

మరిన్ని