Pinnelli: పోలింగ్‌ మరుసటి రోజు నేను గడపే దాటలేదు: పిన్నెల్లి

పోలింగ్‌ తర్వాత రోజు మాచర్లలోని తన ఇంటి నుంచి అడుగు కూడా బయటపెట్టలేదని రెండోరోజు విచారణలో పోలీసులకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు.

Published : 10 Jul 2024 09:36 IST

‘పోలింగ్‌ తర్వాత రోజు మాచర్లలోని మా ఇంటి నుంచి నేను అడుగు బయటపెట్టలేదు. చుట్టూ పోలీసులు మోహరించారు. ఆ రోజంతా గృహ నిర్బంధంలోనే ఉన్నా. కారంపూడి ఎలా వెళ్తా? అక్కడికి వెళ్లి సీఐపై దాడి ఎలా చేస్తా? కారంపూడి ఘటనకు, నాకు సంబంధం లేదు’... ఇదీ రెండోరోజు విచారణలో పోలీసులకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటంతో పాటు విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేయడంపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 

Tags :

మరిన్ని