Amaravati: అమరావతిలో వైకాపా అరాచకనేత.. కృష్ణాతీరంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ

గత ప్రభుత్వంలో ముఖ్యనేత అండ చూసుకుని రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని ఐదేళ్లపాటు చెరబట్టారు.

Published : 10 Jul 2024 11:54 IST

ఇసుక తవ్వాలన్నా తరలించాలన్నా ఐదారు ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు కావాలి. కానీ ఒక్క అనుమతీ లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం. గత ప్రభుత్వంలో ముఖ్యనేత అండ చూసుకుని రాజధాని ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని ఐదేళ్లపాటు చెరబట్టారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయారు. ఇసుకను అక్రమంగా తరలించి వందల కోట్లకు పడగలెత్తారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవారు. ఐదేళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు ప్రభుత్వం మారిన తర్వాతైనా అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags :

మరిన్ని