Vizag: విశాఖలో వైకాపా భూ దోపిడీ.. రూ.వందల కోట్ల భూములను కారుచౌకగా కొట్టేశారు!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో ఇష్టారీతిన వైకాపా (YSRCP) నేతలు చేసిన భూ దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Published : 11 Jul 2024 12:07 IST

అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో ఇష్టారీతిన వైకాపా (YSRCP) నేతలు చేసిన భూ దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మధురవాడలోని ఎన్‌సీసీ భూములను మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళీ కారుచౌకగా కొట్టేశారు. స్థిరాస్తి వెంచర్లు వేసి విక్రయించాలని ప్రణాళిక వేశారు. పైగా ఈ భూముల్లోకి రావడానికి వీలుగా రూ.17 కోట్ల ప్రజాధనంతో 80 అడుగుల రోడ్డును నిర్మించిన జీవీఎంసీ.. కొట్టు మురళీకి టీడీఆర్‌ బాండ్ల రూపంలో రూ.వందల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. కూటమి నేతలతో పాటు విశాఖ ప్రజల ఆందోళనతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఆగింది. 

Tags :

మరిన్ని