Schools Works: అసంపూర్తిగా ‘నాడు- నేడు’ పనులు.. జగన్ వైఫల్యంతో విద్యార్థులకు అవస్థలు!

పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని కబుర్లు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. గడిచిన ఐదేళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. జగన్ సర్కారు నిర్వాకంతో 70 శాతానికిపైగా బడుల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

Published : 10 Jul 2024 14:26 IST

పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని కబుర్లు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. ఐదేళ్లలో వాటిని దారుణంగా మార్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. జగన్ సర్కారు నిర్వాకంతో 70 శాతానికిపైగా బడుల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గదులు నిర్మించిన చోట ఫ్లోరింగ్ చేయలేదు. ఫ్లోరింగ్ చేస్తే.. ప్లాస్టింగ్ పూర్తి చేయలేదు. చాలాచోట్ల ద్వారాలు, కిటికీల సంగతే మరిచారు. చాలా చోట్ల నాసిరకం పనులు, పెచ్చులూడుతున్న శ్లాబ్‌లు విద్యార్థులు, ఉపాధ్యాయులను భయపెడుతున్నాయి.

Tags :

మరిన్ని