సాయం కోసం వైకాపా బాధితురాలు ఎదురుచూపులు.. సీఎంను కలిసే ప్రయత్నం!

వెన్నెముక సమస్యతో బాధ పడుతున్న కుమార్తెకు సాయం కోసం.. వైకాపా బాధితురాలు ఆరుద్ర ఎదురుచూస్తున్నారు.

Updated : 14 Jun 2024 16:23 IST

వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు సాయం కోసం.. వైకాపా (YSRCP) బాధితురాలు ఆరుద్ర ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి అవకాశం కల్పించాలని కోరారు. కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధ పడుతోంది. కుమార్తె వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నించిన ఆరుద్రను.. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయంపై అనేక సార్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమెను.. జగన్‌ను కలవకుండా అప్పట్లో పోలీసులు అడ్డగించారు. న్యాయం జరగడం లేదనే బాధతో ఆప్పట్లో జగన్ క్యాంపు ఆఫీసు వద్దే ఆరుద్ర ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. కూటమి అధికారంలోకి వచ్చాక ఆదుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని