Ganta Srinivasarao: మీరు స్వచ్ఛందంగా తప్పుకొంటే మంచిది: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగనీయకుండా గత వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. నిర్మాతలు, కె.ఎస్‌.రామారావు, అశోక్‌కుమార్‌లతో కలిసి ఆయన విశాఖలో మాట్లాడారు.

Published : 22 Jun 2024 20:35 IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగనీయకుండా గత వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. నిర్మాతలు, కె.ఎస్‌.రామారావు, అశోక్‌కుమార్‌లతో కలిసి ఆయన విశాఖలో మాట్లాడారు. ‘‘వ్యవస్థలను పాడుచేసిన వారందరూ ఎన్నికల ఫలితాలు వచ్చాక తప్పుకొంటూ వస్తున్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ అసోసియేషన్‌లో వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకొంటే మంచిది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని హెచ్చరించారు. 

Tags :

మరిన్ని