Eluru: శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకటలాడింది.

Published : 18 Jun 2024 16:57 IST

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకటలాడింది. మంగళవారం స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. 

Tags :

మరిన్ని