Raigad Fort: రాయ్‌గఢ్ కోటలోకి వరద నీరు.. భయాందోళనలో పర్యటకులు!

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటలో ఒక్కసారిగా సంభవించిన ఆకస్మిక వరదలు పర్యటకులను బెంబేలెత్తించాయి. ఆదివారం రాయ్‌గఢ్ జిల్లాలోని కోటను సందర్శించడానికి భారీ సంఖ్యలో పర్యటకులు వచ్చారు. కోట పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో అకస్మాత్తుగా కోటపై నుంచి మెట్ల మార్గంలో పరవళ్లు తొక్కుతూ వరద నీరు ప్రవహించింది. 

Updated : 08 Jul 2024 19:25 IST

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటలో ఒక్కసారిగా సంభవించిన ఆకస్మిక వరదలు పర్యటకులను బెంబేలెత్తించాయి. ఆదివారం రాయ్‌గఢ్ జిల్లాలోని కోటను సందర్శించడానికి భారీ సంఖ్యలో పర్యటకులు వచ్చారు. మధ్యాహ్న సమయంలో భారీ వర్షం రాయ్‌గఢ్ కోట పరిసరాల్లో కురిసింది. దీంతో అకస్మాత్తుగా కోటపై నుంచి మెట్ల మార్గంలో పరవళ్లు తొక్కుతూ వరద నీరు ప్రవహించింది. ఈ క్రమంలో బెంబేలెత్తిన పర్యటకులు.. మెట్ల మార్గంలోని కోట గోడలపైకి ఎక్కి వరద ఉద్ధృతి నుంచి తప్పించుకున్నారు. మరికొందరు దారి మధ్యలో ఆసరాగా ఉన్న ఇనుప కడ్డీలను పట్టుకొని బయటపడ్డారు. ఆ ప్రాంతంలో చిక్కుకున్న పర్యటకులను సహాయక సిబ్బంది కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో రాయ్‌గఢ్ కోట నడక మార్గాలను, రోప్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని