IND vs PAK: టాస్‌ కాయిన్‌ ఎక్కడ భాయ్‌..?: రోహిత్‌ ఫన్నీ వీడియో

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి టాస్‌ కాయిన్‌ విషయంలో కావడం గమనార్హం.

Published : 10 Jun 2024 07:06 IST

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. కేవలం 120 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని దాయాది దేశంపై జైత్రయాత్రను కొనసాగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టాస్‌ వేసే సమయంలో చోటు చేసుకున్న ఫన్నీ సంఘటనలు అభిమానులను నవ్వుల్లో ముంచాయి. టాస్‌ కాయిన్‌ను జేబులోనే పెట్టుకున్న రోహిత్.. ఆ విషయాన్ని మరిచిపోయాడో ఏమో.. టాస్‌ కాయిన్‌ ఎక్కడ ఉంది భాయ్‌? అంటూ ప్రశ్నించాడు. తర్వాత తన జేబును చెక్‌ చేయగా అందులోనే ఉంది. దీంతో రోహిత్‌తోపాటు పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ సరదాగా నవ్వేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని