California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. అగ్నికి ఆహుతైన అటవీ ప్రాంతం

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని కలవెరాస్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

Published : 18 Jun 2024 18:54 IST

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని కలవెరాస్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే  20.2 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు. కలవెరాస్ కౌంటీలోని అటవీ ప్రాంతంలో సోమవారం అగ్గి రాజుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 12 వందల మందిని ఖాళీ చేయించారు.

Tags :

మరిన్ని