134 భాషల్లో వందేమాతరం తిరగరాత.. మిర్రర్‌ రైటింగ్‌లో రాణిస్తున్న యువతి

మాతృభాషను తప్పులు లేకుండా రాయడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు.

Published : 13 Jun 2024 13:51 IST

మాతృభాషను తప్పులు లేకుండా రాయడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఆమె మాతృభాష తెలుగుతో పాటు 134 భాషల్లో వందేమాతరం గీతాన్ని మిర్రర్ రైటింగ్ (Mirror Writing) ద్వారా రాసి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవలే బెస్ట్ అఛీవర్స్ అవార్డును సొంతం చేసుకొంది. విశాఖ జిల్లా పెదవలస గ్రామానికి చెందిన రమ్య చదువు రీత్యా కొంతకాలంగా నర్సీపట్నం సమీపంలోని ధర్మసాగరంలో బంధువుల వద్ద ఉంటోంది. రమ్యకు మరో ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న మిర్రర్ రైటింగ్. ఇప్పుడు తనకెంతో గుర్తింపును తెస్తూ ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టిందని రమ్య సంతోషం వ్యక్తంచేసింది. 

Tags :

మరిన్ని