మంధాన గురించి ఇంకా..
* సొంతూరు మహరాష్ట్రలోని సాంగ్లి * తండ్రి శ్రీనివాస్, అన్న శ్రవణ్..ఇద్దరూ క్రికెటర్లే. శ్రీనివాస్ జిల్లా స్థాయిలో, శ్రవణ్ అండర్-19లో స్థాయిలో ఆడారు * 12 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికైంది * వెస్ట్‌జోన్ అండర్-19 వన్డే టోర్నీ (2013)లో డబుల్ సెంచరీ (150 బంతుల్లో 224) చేయడం ద్వారా తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలే. రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన బ్యాటుతో ఆమె ఈ ద్విశతకం చేయడం విశేషం. ఆ బ్యాటును షోకేస్‌లో భద్రంగా దాచుకుంది. * 2013లో వన్డేల్లో, 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది * మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్స్‌కు ప్రాతినిధ్యం వహించింది
|