వారి వెనుక అతను

ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఎక్కడున్నా గుర్తించి వాళ్ల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు యాట్ క్లబ్ వ్యవస్థాపకుడు, కోచ్ సుహీం షేక్. పేద క్రీడాకారులకు కూడా ఈ ఆటను దగ్గర చేయాలని.. బస్తీలకు వెళ్లి పిల్లల్ని ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చి ఛాంపియన్లను చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వీరి నుంచి రుసుములేమీ వసూలు చేయట్లేదు. మిత్రులు.. కొన్ని సంస్థల ఆర్థిక సాయంతో క్లబ్‌ను నడపిస్తున్నాడు. సుహీం బృందం ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలకు వెళ్లి సెయిలింగ్ గురించి వివరించి ఎనిమిదేళ్ల కన్నా ఎక్కువ వయసుండి.. ఆసక్తి ఉన్న వాళ్ల పేర్లను నమోదు చేయించుకుంటుంది. వారిలో కొందరిని పాఠశాల ప్రతిపాదిస్తే.. మరికొందరు సొంత ఆసక్తితో వస్తారు. అలా వచ్చిన వారికి శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. అలా ఎంపికచేసిన వారికి సెయిలింగ్‌లో శిక్షణ దగ్గర నుంచి పౌష్టికాహారం అందించడం, వారి చదువును ఎప్పటికప్పుడూ సమీక్షించడం, పాఠశాల నుంచి తీసుకురావడంతో పాటు తిరిగి దించి రావడం వరకూ మొత్తం బాధ్యత యాట్ క్లబ్‌దే. 2009లో మూడు పడవలతో మొదలైన యాట్ క్లబ్లో ప్రస్తుతం 50 పడవలు ఉన్నాయి.
|