
శ్రీనగర్: ఆన్లైన్లో మనం చేసుకొనే ఆర్డర్ల డెలివరీకి సాధారణంగా బైక్ లేదా ఇంకేదైనా వాహనం వాడతారు. కానీ ఇక్కడో వ్యక్తి గుర్రంపై వచ్చి వస్తువులను డెలివరీ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్, శ్రీనగర్‌లలో కురుస్తున్న హిమపాతంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు కష్టంగా మారడంతో గుర్రపు స్వారీ ద్వారా అమెజాన్ ఆర్డర్లు డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వ్యక్తి గుర్రంపై మంచుతో కప్పబడిన రహదారులపై సంచరిస్తూ వినియోగదారులకు పార్శిల్స్ అందజేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ట్విటర్లో ఒక నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను అమెజాన్ డెలివరీ ఇన్నోవేషన్ అని పేర్కొంటూ ఓ వినియోగదారుడు ట్విటర్లో పంచుకున్నాడు. సంక్లిష్ట పరిస్థితుల్లో గుర్రంపై తన విధి నిర్వర్తిస్తున్న ఆ డెలివరీ బాయ్‌ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత వారం నుంచి జమ్ము కశ్మీర్లో నిరంతరాయంగా హిమపాతం కురుస్తోంది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.
ఇవీ చదవండి..
మేమే నయం.. అంటున్న కుక్క, పిల్లి
మరిన్ని
దేవతార్చన
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!