Viral Video :  పడి పడి లేచిన ‘చిన్నారి’ కెరటం
close

Published : 02/08/2021 23:54 IST
Viral Video :  పడి పడి లేచిన ‘చిన్నారి’ కెరటం


ఇంటర్నెట్‌ డెస్క్‌: స్ఫూర్తి పొందడానికి వయసుతో సంబంధం లేదు.. సరిగ్గా అదే నిజమనిపిస్తుంది 4ఏళ్ల ఈ చిన్నారిని చూస్తే. అది అమెరికాలోని మసాచుసెట్స్‌లోని హడ్సన్ అనే ప్రదేశం. 8 ఏళ్లలోపు చిన్నారులకు రోలర్ స్కేటింగ్ పోటీ జరిగింది. ఇందులో.. నాలుగేళ్ల చిన్నారి మియాస్ పోటీ ప్రారంభమైన వెంటనే కొద్ది దూరం పరుగెత్తి ముందుకెళ్లి కిందపడిపోయింది. కింద పడినా సరే.. మియాస్‌ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వెంటనే తేరుకొని తిరిగి స్కేటింగ్ ప్రారంభించింది. అంతేనా... పోటీలో ముందున్న చిన్నారులను వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. కాగా ఈ పోటీకి సంబంధించిన వీడియోను మియాస్ తండ్రి ఆంటోని 2020లో నెట్టింట్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌ సందర్భంగా మళ్లీ నెట్టింట వైరలై ఇప్పటి వరకూ 50 కోట్ల వ్యూస్‌ దక్కించుకుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని