close

Published : 15/09/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూగజీవిపై ఇంత కర్కశత్వమా..

ఇంటర్నెట్‌ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఏ పాపం ఎరుగని ఓ శునకాన్ని ఓ వ్యక్తి అమాంతం ఎత్తి, సమీపాన ఉన్న చెరువులోకి విసిరేశాడు. నగరంలోని వీఐపీ రోడ్డులో ఉన్న ఓ వంతెనపై జరిగిన ఈ సంఘటన పట్ల నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు మనుషుల్లో మానవత్వం మిగిలుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోలో ఓ యువకుడు తన సమీపంలో తిరుగుతున్న రెండు కుక్కల్లో ఒకదానిని చేతుల్లోకి తీసుకుని సమీపంలోని చెరువులోకి విసిరేశాడు. అనంతరం ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి వైపు నవ్వుతూ చూడటం గమనించవచ్చు. దీనితో ఈ పనిని పథకం ప్రకారమే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసేందుకు తలపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు పాల్పడిన సల్మాన్‌ అనే ఈ యువకుడు పాత భోపాల్‌ ప్రాంతానికి చెందినవాడని తెలిసింది.

కాగా, సల్మాన్‌ను భోపాల్‌ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించిన నేరం కింద ఆతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే తాను ఆ సమయంతో మత్తులో ఉన్నానని.. శునకాన్ని రక్షించేందుకు తాను కూడా దూకాలనుకున్నానని సల్మాన్‌ నగరానికి చెందిన ఓ న్యాయవాదికి చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా తన చర్యకు సోషల్‌ మీడియాలో క్షమాపణ చెబుతానని కూడా అన్నట్టు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.