Viral video: వారే.. నిచ్చెనలా మారి పిల్లల్ని కాపాడారు
close

Published : 24/08/2021 23:37 IST
Viral video: వారే.. నిచ్చెనలా మారి పిల్లల్ని కాపాడారు

మంటలు, పొగలు కమ్ముకున్నా ప్రాణాలకుపైగా తెగించి కాపాడారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా నిజమైన హీరోల్లా మారి.. మంటలంటుకున్న భవనం నుంచి పొగకమ్ముకొస్తున్నా.. తమ ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు పిల్లల్ని కాపాడారు. నిచ్చెన అవసరం ఉన్న ఇలాంటి సందర్భంలో.. వారందరూ తలో చేయి వేసి ఐక్యతను చాటుతూ సమయస్ఫూర్తి ప్రదర్శించారు. చైనాలో జిన్టియన్ అనే ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఓ భవనంలోని మూడో అంతస్తుకు మంటలంటుకొని నల్లటి పొగలు వస్తుండగా... ఆరుగురు యువకులు కిటీకి ఎక్కి .. బాల్కనీ నుంచి ఇద్దరు పిల్లల్ని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోని ఫేస్‌బుక్ లో ‘ట్రెండింగ్‌ ఇన్‌ చైనా’ అనే పేజీ షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు వారు పడ్డ శ్రమని అభినందిస్తున్నారు. ‘‘ఐక్యత బలాన్నిస్తుంది’’ అని చాటిచెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని