close

Published : 14/09/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇండోనేషియాలో మన సినిమా పాట.. అదిరింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ దేశంలోనైనా సినిమాలకు.. అందులోని పాటలకు తప్పకుండా క్రేజ్‌ ఉంటుంది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘కభీ ఖుషీ.. కభీ ఘమ్‌’లోని ‘బోలే చూడియా’ గీతం విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిత్ర కథ ప్రకారం.. ఓ కుటుంబ కార్యక్రమంలో భాగంగా కరీనా కపూర్‌ దీనిలో ఆడి పాడుతుంది. కాగా ఈ గీతంలో తనతో పాటు షారుఖ్‌ ఖాన్‌, కాజల్‌, హృతిక్‌ రోషన్, అమితాబ్‌ బచ్చన్, జయా బచ్చన్‌ కూడా కనిపిస్తారు.

ఇదిలా ఉండగా ఇండోనేషియాకు చెందిన వినా ఫాన్‌ అనే యువతి, మరి కొందరితో కలసి ఈ గీతానికి చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ యూట్యూబ్‌ వీడియోను చూసిన  నెటిజన్లు దుస్తులు, స్టెప్స్‌, హావభావాలు, లిప్‌ సింక్‌.. ఇలా ఏ విషయంలోనూ వంక పెట్టడానికి వీలే లేదని కితాబిచ్చేశారు. మరి అదెంత నిజమో మీరే చూడండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.