close

Published : 13/10/2020 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆమె నవ్వు నెటిజన్ల మనసును దోచుకుంది..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉన్న హరిహర్‌ కోట ప్రముఖ పర్యాటక స్థలం. కొండమీద శిధిలావస్థలో ఉన్న ఈ కోటను దర్శించేందుకు ఎందరో పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఈ కోటను చూడాలంటే 3676 అడుగుల ఎత్తుకు చేరుకోవాల్సిందే. ఇక ఇక్కడికి చేరేందుకు నిట్టనిలువుగా ఉన్న పాతకాలం నాటి రాతి మెట్లు తప్ప మరో మార్గం లేదు. నిటారుగా సుమారు 80 డిగ్రీల కోణంలో ఉండే ఈ మెట్లను ఎక్కడం శిక్షణ పొంది, అలవాటు ఉన్న వారికే కష్టం అని భావిస్తారు. 

అయితే ఆశా అంబాడే ఓ 68 ఏళ్ల సాధారణ మహిళ, అదీ చీరకట్టుతో ఎంతో శ్రమకు ఓర్చి మేఘాలను తాకుతున్నట్టున్న ఈ కొండను అధిరోహించారు.  కాగా, అక్కడ ఉన్నవారు ఆమెకు కేరింతలు కొడుతూ కరతాళధ్వనులతో స్వాగతం చెప్పడంతో ఆశ్చర్యపోవటం ఆమె వంతయింది. ఈ సంఘటనను సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రభుత్వాధికారి ‘మనసుంటే మార్గముంటుంది..’ అనే వ్యాఖ్యను జతచేశారు. ఇక  చివరి మెట్టు కూడా ఎక్కి లోపలికి వచ్చే సమయంలో ఆమె నవ్వు వైరల్‌ అయ్యి.. నెటిజన్ల మనసు దోచుకుంది. మరి ఆ విజయ దరహాసాన్ని ఈ వీడియోలో మీరూ చూసేయండి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.