close

Published : 06/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఫల’వంతమైన సంగీతం.. వైరల్‌ వీడియో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యం కోసం రకరకాల పండ్లను ఆహారంగా తీసుకుంటారు. అయితే పండ్ల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవటమే కాకుండా.. సంగీతాన్ని వినిపించే సాధనాలను కూడా సృష్టించవచ్చని ఊహించగలమా? నమ్మశక్యంగా లేని ఈ విషయాన్ని ఓ వ్యక్తి సాధ్యమే అని నిరూపించారు. ఇందుకుగాను పుచ్చకాయ, తర్బూజా, లిచ్చి పళ్లతో తయారుచేసిన ‘పియానో’తో శ్రావ్యమైన సంగీతాన్ని సృష్టించి మరీ వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఈ నెల 3వ తేదీన పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు రెండు రోజుల్లో 17లక్షల వ్యూస్‌ లభించాయి. ఇదెలా సాధ్యమైందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సృష్టిలో అణువణువునా సంగీతం ఉంది అంటారు. ఆ మాట నిజమే అనిపించే ఈ వీడియోను.. మీరూ చూసి, విని ఆనందించండి మరి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.