మెట్రో రైలులో.. కోతి చేష్టలు
close

Published : 20/06/2021 16:16 IST
మెట్రో రైలులో.. కోతి చేష్టలు

దిల్లీ: దిల్లీలో ఓ కోతికి రైలులో ప్రయాణించాలనే కోరిక కలిగినట్టుంది. వెంటనే అది మెట్రో రైలులో ప్రత్యక్షమైంది. అయితే అది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదు. అటూ ఇటూ తిరుగుతూ.. తన చేష్టలతో ప్రయాణికులకు కొంత సేపు వినోదాన్ని పంచింది. తర్వాత సీటుపై ఓ ప్రయాణికుడి పక్కనే కూర్చొని రైలు అద్దాల్లోంచి ఎంచక్కా రాజధాని అందాలను చూస్తూ ప్రయాణించింది. కోతి మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. వీడియోలో వినిపిస్తున్న ప్రయాణికుడి మాటల ద్వారా ఆ రైలు యమునా తీరం నుంచి ఐసీ స్టేషన్‌ మధ్యలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసి దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌(డీఎమ్‌ఆర్‌సీ)అధికారులు స్పందించారు. ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆ వీడియోకు ప్రతిస్పందనగా.. కోతి ప్రయాణించిన బోగీ వివరాలు ఇవ్వాలంటూ కోరారు.  ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని