
ఇంటర్నెట్ డెస్క్: కొత్త వస్తువు ఏదైనా కొన్న తర్వాత దానికి ఉన్న ప్యాకింగ్‌ను విప్పి, చూసుకుని మురిసిపోవటం అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ వాహనాల విషయంలో అది వీలయ్యేది కాదు. అయితే కరోనా వైరస్ దీనిని కూడా సాధ్యం చేసేసింది. ఎలా అంటే..
కొవిడ్-19 వ్యాప్తి ప్రజలు, వ్యాపార సంస్థల అలవాట్లు, పద్ధతులను ఎంతో ప్రభావితం చేస్తోంది. వస్తువుల శానిటైజేషన్, అన్లైన్ విక్రయాలు, కాంటాక్ట్‌లెస్ డెలివరీ విధానం తదితర విధానాలకు ప్రోత్సాహం లభిస్తోంది. కాగా, కరోనా వైరస్ జాగ్రత్తల విషయంలో తాము మరో అడుగు ముందున్నట్టు ప్రముఖ వాహనాల సంస్థ టాటా మోటర్స్ ప్రకటించింది. వినియోగదార్లకు తమ కారు పూర్తి సురక్షితమనే భావన కలిగించేందుకు గాను.. ప్రతి కొత్త కారును ‘సేఫ్టీ బబుల్’లో ఉంచి మరీ వారికి అందజేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
కొత్త కార్లను యజమానులకు అప్పగించే ముందు దానిని ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి, పూర్తిగా శానిటైజ్ చేసి మరీ అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోను టాటా మోటర్స్ సామాజిక మాధ్యమాల్లో ఉంచగా.. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని
దేవతార్చన
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొవిడ్ టీకా అలజడి
- సాహో భారత్!
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్