close

Published : 06/10/2020 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అధ్యక్షా..  ఆ మాట వారికి చెప్పండి!

ట్రంప్‌కు జో బైడెన్‌ చురకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత వారం కొవిడ్‌-19 సోకిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం సోమవారం రాత్రి డిశ్ఛార్జి అయ్యారు. అయితే అప్పటి వరకూ మాస్క్‌ ధరించిన ఆయన.. శ్వేతసౌధాన్ని చేరగానే దానిని తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ట్రంప్‌ తీరును ఖండిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీనిలో అయన మాస్క్‌ను ధరిస్తూ ఉండగా.. అదే సమయంలో ట్రంప్‌ దానిని తొలగిస్తూ కనిపిస్తారు. ఈ వీడియోకు మాస్క్‌ ధరించండి అనే వ్యాఖ్యను బైడెన్ జతచేశారు.

కరోనా వైరస్‌కు భయపడద్దంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రహితమైనవని బైడెన్‌ విమర్శించారు. తమ ఆత్మీయులను కోల్పోయిన రెండు లక్షలకు పైగా కుటుంబాలకు ఆ మాట చెప్పాలని ఆయన ట్రంప్‌కు సవాలు విసిరారు. ‘‘ఇంత జరిగిన తరువాత అధ్యక్షుడు క్షేమంగా ఉండటం మంచిదే.. అయితే మాస్క్‌ ధరించటం తప్పనిసరి అని నేర్చుకున్న పాఠాన్ని ఆయన అమెరికా ప్రజలకు సరైన రీతిలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ మాస్కులు ముఖ్యమైనవి. ప్రాణాలను రక్షిస్తాయి.. వ్యాధి వ్యాప్తించకుండా కాపాడతాయి.. ’’ అని ఈ సందర్భంగా జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.