close

Published : 09/09/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏడేళ్ల స్పైడర్‌ మ్యాన్‌.. భారత్‌లోనే!

ఇంటర్నెట్‌ డెస్క్: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన యశ్వంత్‌ సింగ్‌ గౌర్‌ అనే మూడో తరగతి విద్యార్థి ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాడు. స్పైడర్‌ మ్యాన్‌ చిత్రం చూసి ప్రేరణ పొందిన ఈ బాలుడు గోడలను చకచకా ఎక్కి దిగేస్తున్నాడు.

‘‘నేను స్పైడర్‌ మ్యాన్‌ సినిమా చూసి అతనిలాగే గోడలు ఎక్కాలనుకున్నాను. అలా చేసేందుకు ఇంటి దగ్గర సాధన చేశాను. మొదట్లో కింద పడిపోయినా తర్వాత ఆ టెక్నిక్‌ను బాగా నేర్చుకున్నాను. దీని గురించి మొదట మా అన్నకు  చెప్పా. అతడి నుంచి అందరికీ తెలిసిపోయింది’’ అని అంటున్నాడు. పెద్ద పోలీస్‌ అధికారి కావాలన్నది ఈ అబ్బాయి కోరికట!

అంతేకాకుండా.. ఈ బుడతడు గోడ వైపు తల ఉంచి, వెనక్కి తిరిగి గోడను ఎక్కి దిగిపోగలడట. మరి పడిపోతావనే భయం వేయదా అంటే.. తనకేం భయం లేదని, పడిపోతానని అనిపించినపుడు దూకేస్తానంటున్నాడీ గడుగ్గాయి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.