close

Published : 01/09/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కనురెప్పపాటులో తప్పించుకుంది!

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా చాలా మంది అదృష్టాన్ని నమ్మరు. అయితే, కేవలం అదృష్టవశాత్తూ జరిగినదే అని నమ్మక తప్పని ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల నెట్టింట్లో సందడి చేస్తోంది. 30 సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో.. కర్యాన్‌ జాన్సన్‌ అనే ఈ మహిళ ఓ బస్ స్టాప్‌ వద్ద నిలబడింది. అక్కడే ఉన్న ఓ స్తంభం వద్ద తన సామాను పెట్టుకొని... కాస్త వెనక్కు నడిచింది. పేవ్‌మెంట్‌ మీద ఆమె అప్పటివరకు నిలబడి ఉన్న చోటికి కనురెప్ప పాటులో ఓ కారు వేగంగా దూసుకొచ్చేసింది. ఈ సంఘటనలో జాన్సన్‌ సామగ్రి మొత్తం నాశనమయిపోయింది. కారు ఢీకొనటంతో ఆ స్తంభం నేలమట్టమైపోయింది. అదే స్థానంలో ఆ మహిళ ఉంటే ఏం జరిగేదో ఊహించటానికే ధైర్యం చాలటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఓ దుకాణం బయట చోటుచేసుకున్న ఈ వీడియోను ఆ షాపు యజమాని షేర్‌ చేశారు. ‘‘ ఆ కారు వచ్చిన వేగానికి మా పక్కనే ఉన్న దుకాణం చాలా వరకు నాశనమైపోయింది. అదృష్టవశాత్తూ ఎవరూ అంతగా గాయపడలేదు. ఈ రోజు చూసిన సంఘటనను నేను అంత త్వరగా మర్చిపోలేను. ఆమె చాలా లక్కీ.’’ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ చూడండి...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.