Viral Video: పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు
close

Published : 28/08/2021 16:10 IST
Viral Video: పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త జీవితానికి స్వాగతం పలికే పెళ్లి వేడుక ప్రతి ఒక్కరికీ సుమధురమైన ఘట్టం. ఆ వేడుక తీపి జ్ఞాపకాలు జీవితాంతం పదిలంగా ఉంచుకుంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు వివాహతంతు రసాభాసగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనే తాజాగా నెట్టింట వైరల్​గా మారింది.

పెళ్లిమండపంలో వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉన్నారు. వారిచుట్టూ బంధువులు చేరగా.. ఉత్సాహంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పెళ్లిపీటలపై ఉన్న వధువు కోపంగా ఉంది. తనకు కాబోయే భర్త పొగాకు నములుతున్నాడని వధువుకు తెలిసిపోవడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. వరుడి చర్యను అసహ్యించుకున్న ఆమె.. అతడితో పాటు ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టింది. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న వరుడు వెంటనే లేచి నిలుచుని నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. వరుడిని కొడుతుండగా వధువును ఎవరూ ఆపకపోవడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వధువు చర్యను ప్రశంసిస్తున్నారు. పెళ్లి పీటలపై పొగాకు తింటున్న వరుడిపై విమర్శలు చేస్తున్నారు. మరి ఇది నిజంగా జరిగిందా? లేక కావాలనే వీడియో కోసం చేశారా? అన్నది తెలియరాలేదు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని