Viral Video: పిల్ల కోతీ.. అదిరింది నీ మతి!
close

Published : 16/07/2021 23:40 IST
Viral Video: పిల్ల కోతీ.. అదిరింది నీ మతి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పట్టు పట్టరాదు.. పట్టి విడవరాదు’ అన్న మాటను రుజువు చేస్తోంది ఈ వీడియోలోని పిల్ల కోతి. ఓ గోడను ఎక్కడానికి ప్రత్నించిన కోతి పిల్ల.. ఆ గోడ తడిగా ఉండటం వల్ల జారి కిందపడింది. అయినా ప్రయత్నించడం మానలేదు. మరోసారి గోడ పైకి ఎగిరింది. మళ్లీ కింద పడింది. ఇదంతా గమనిస్తున్న తల్లి కోతి గోడ ఎక్కి కూర్చోగా.. దాని తోకను పట్టుకుని తెలివిగా గోడ ఎక్కింది. దానికి సంబంధించిన దృశ్యాలను వివేక్‌ నాయర్‌ అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా పంచుకోగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని