Viral Video: సంగీతం వింటున్న బెలుగా తిమింగలాలు
close

Published : 05/08/2021 23:31 IST
Viral Video: సంగీతం వింటున్న బెలుగా తిమింగలాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెల్లటి రంగులో.. భారీ శరీరాకృతితో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే అరుదైన సముద్ర జీవులు బెలుగా తిమింగలాలు. సముద్ర అక్వేరియంలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ బెలుగాలకు  సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అమెరికాలోని మిస్టిక్‌ అక్వేరియంలో ఉండే జూనో, కేలా, నటాషా అనే పేర్లు గల బెలుగా తిమింగలాలను ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చిన బిగ్‌లక్స్‌ అనే సంగీతకారుడు వయెలిన్‌ వాయించగా.. బెలుగాలు అమితాసక్తితో విన్నాయి. ఆ సంఘటనకు సంబధించిన దృశ్యాలను మిస్టిక్‌ అక్వేరియం నిర్వాహకులు తమ ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకున్నారు. నెట్టింట్లో విస్తృతం అవుతున్న ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2.8 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లను బెలుగాలు అందంగా ఉన్నాయనీ.. వాద్యకారుడు అద్భుతంగా వయొలిన్‌ వాయించాడనీ విభిన్న రీతుల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని