Viral Video: ఒక పీత..ఐదుసింహాలు..
close

Published : 07/07/2021 19:00 IST
Viral Video: ఒక పీత..ఐదుసింహాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత మనుషులతో పాటు అన్ని ప్రాణులకూ ఉంటుందని తెలియజేస్తున్నాయి ఈ సింహాలు. సాధారణంగా 180 కిలోల పంజా విసరగల సింహం, ఒక పీతను నామరూపాలు లేకుండా చేయగలదు. కానీ, దక్షిణాఫ్రికాలోని మలమాలా గేమ్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అలా జరగలేదు. కలుగులోంచి బయటకు వచ్చిన పీతను ఓ సింహం ఉత్సుకతతో పరిశీలించింది. దాంతో పాటు మరో నాలుగు సింహాలు ఇంతకుముందెన్నడూ పీతను చూడనట్టు ప్రవర్తించాయి. ఆ పీత మరలా తన కలుగులోకి వెళ్లే వరకూ దాన్ని అలా చూస్తూనే ఉన్నాయి సింహాలు. ఫారెస్ట్‌ అధికారులు దీనికి సంబంధించిన వీడియోను లేటెస్ట్‌ సైటింగ్స్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని