Viral video: సలసల కాగే నీటిలో బుడ్డోడు.. ఆశ్చర్యంలో నెటిజన్లు!
close

Published : 08/09/2021 23:47 IST
Viral video: సలసల కాగే నీటిలో బుడ్డోడు.. ఆశ్చర్యంలో నెటిజన్లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కడాయిలో నీరు సలసల కాగుతోంది. దాని కింద పెద్ద మంట. అయితే అందులో ఓ బాలుడు కూర్చోవడం.. చీమ కుట్టినట్లు కూడా లేకండా ప్రశాంతంగా ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఎలా సాధ్యమంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది.

ఇప్పటికే మనం ఎన్నో వింతైన వీడియోలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ బాలుడు కడాయిలో కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా అందులో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. కాగా ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు దీనిని 2.1 మిలియన్ల మంది వీక్షించారు. అయితే ఈ ఇది ఫేక్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇదొక మ్యాజిక్ ట్రిక్ అని కామెంట్ చేస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని