Viral Video: ‘బుల్లెట్‌ బండి...’ పాటకు నవ వధువు స్టెప్పులు
close

Published : 19/08/2021 01:31 IST

Viral Video: ‘బుల్లెట్‌ బండి...’ పాటకు నవ వధువు స్టెప్పులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనువాడబోయే వాడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ పెళ్లి బరాత్‌లో ‘బుల్లెట్‌ బండి...’ పాటకు ఓ నవ వధువు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్‌ బండి...’ పాటకు నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్‌ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ట్వీట్‌ చేశారు. గాయని మోహన భోగరాజును ఆయన ట్యాగ్‌ చేయగా.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కొత్త పెళ్లికూతురు స్టెప్పులకు అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. కేరింతలు కొడుతూ చప్పట్లతో మరింత ఉత్సాహాన్నిచ్చారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ అదే స్పందన వస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని