Viral Video: వరుడిని ఆటపట్టించిన వధువు
close

Published : 27/06/2021 18:51 IST

Viral Video: వరుడిని ఆటపట్టించిన వధువు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పానీపూరీ కోసం ఉవ్విళ్లూరుతున్న వరుడిని వధువు ఆటపట్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివాహ వేడుక సమయంలో వధువు ప్లేట్‌లో పానీపూరి పెట్టగా ఆశగా నోరు తెరుస్తాడు వరుడు. అతడి నోటి దగ్గరికి పానీపూరి తీసుకెళ్లిన వధువు వరుడికి తినిపించకుండా తానే తింటుంది. రెండోసారైనా తినిపిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న వరుడికి ఈసారీ నిరాశే ఎదురవుతుంది. రెండోసారి కూడా వరుడి నోటి దగ్గరకు తీసుకెళ్లి.. అతడు తినేందుకు ముందుకొస్తుండగా దాన్ని మళ్లీ తానే ఆరగిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను వధువు సోషల్‌ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు. 11 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి..


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని