Viral: మార్షల్‌ ఆర్ట్స్‌ చేసి అదరగొట్టిన వధువు
close

Published : 02/07/2021 18:54 IST
Viral: మార్షల్‌ ఆర్ట్స్‌ చేసి అదరగొట్టిన వధువు

తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు చేసిన విన్యాసాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివాహం తరువాత నిర్వహించిన ఊరేగింపులో.. ఆత్మరక్షణ విద్యకు సంబంధించిన కత్తి, కర్ర సాములు చేసి నిషా (22) అనే వధువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్ననాటి నుంచే ‘సిలంబమ్‌’ అనే మార్షల్ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న నిషా తన పెళ్లి రోజున అందరికి గుర్తుండిపోయేలా ఫీట్లు చేసి అలరించింది. మహిళలకు ఆత్మరక్షణ విద్యపై అవగాహన కల్పించేందుకు ఇలా చేసినట్లు ఆమె తెలిపింది. ఈ యుద్ధ విద్యలను తన మేనమామ రాజ్‌కుమార్‌ (29) నుంచి నేర్చుకున్నానని, ఇప్పుడు తననే వివాహం చేసుకున్నట్లు వధువు పేర్కొంది. 

నిషా మార్షల్‌ఆర్ట్స్‌ చేస్తున్న వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. నిషాను చూసి బాలికలందరూ స్ఫూర్తి పొంది.. ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలను నేర్చుకోవాలన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా శెభాష్‌ అంటూ నిషాను మెచ్చుకుంటున్నారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని