సీతాకోక చిలుకల అరుదైన విన్యాసం
close

Published : 17/06/2021 23:57 IST
సీతాకోక చిలుకల అరుదైన విన్యాసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీతాకోక చిలుకలు బురద, పేడ, నీరు వంటివాటి నుంచి తమకు కావలసిన లవణాలను తీసుకోవడానికి గుంపుగా చేరుతాయి. ఈ ప్రవర్తనను మడ్‌ పడ్లింగ్‌ అంటారు. మగ సీతాకోక చిలుకలు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తాయి. మగవి, ఆడవాటిని ఆకర్షించేందుకు బురద, పేడ, నీటి నుంచి లవణాలు, ఫెరోమోన్స్‌ను సేకరిస్తాయి. తాజాగా నలుపు రంగు రెక్కలతో ఉన్న కొన్ని సీతాకోకచిలుకలు మడ్‌ పడ్లింగ్‌ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ వీడియోను ప్రవీణ్‌ కాశ్వన్‌ అనే అటవీశాఖ అధికారి ట్విట్టర్‌ ద్వారా  పంచుకున్నారు. సీతాకోక చిలుకల ఈ అరుదైన విన్యాసాన్ని చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని