
యుకోన్: కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయపెట్టమే కాదు.. మన జీవితాలనూ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా అంతానికి బ్రహ్మాస్త్రమైన టీకా విడుదల కోసం ప్రతిఒక్కరూ ఆశతో ఎదురుచూశారు. టీకా తీసుకున్న పలువురు తమ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, కెనడాలో ఉంటున్న గుర్దీప్ పంధేర్ అనే డ్యాన్స్ మాస్టర్ మాత్రం తన సంతోషాన్ని వినూత్నంగా వ్యక్తపరిచారు. టీకా తీసుకున్న ఆనందంలో గడ్డకట్టిన సరస్సుపైకి వెళ్లి భాంగ్రా నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటిదాకా 18లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘నిన్న సాయంత్రం నేను కొవిడ్ టీకా తీసుకున్నాను. ఆ సంతోషంతో ఓ గడ్డకట్టిన సరస్సుపై భాంగ్రా నృత్యం చేశాను. ప్రపంచవ్యాప్తంగా అందరి శ్రేయస్సును కోరుకుంటున్నా’’ అని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. కరోనా టీకాపై అందరికీ ఇలా ఆయన అవగాహన కల్పిస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
దేవతార్చన
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ