చిరుత-మొసలి పోట్లాట చూశారా?
close

Published : 31/05/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిరుత-మొసలి పోట్లాట చూశారా?

          

అడవి.. ఎన్నో వింతలకు, సాహసాలకు చిరునామా. ప్రాణాలు కాపాడుకునేందుకు వన్యప్రాణుల మధ్య పోట్లాటలు, ఆహారం కోసం వేటాడటం ఇక్కడి జంతువుల నిత్యకృత్యం. అందుకే చురుగ్గా ఉండే ప్రాణే ఇక్కడ మనుగడ సాగిస్తుందని అంటుంటారు. దీన్ని రుజువు చేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నీరు తాగేందుకు ఓ చిరుత సరస్సు వద్దకు వచ్చింది. నీటిలోపల మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేసేందుకు యత్నించింది. ఉలిక్కిపడ్డ చిరుత అమాంతం గాల్లోకి ఎగిరి రెప్పపాటులో అక్కడి నుంచి ఉడాయించింది. ఈ వీడియోను సురేందర్ మెహ్రా అనే ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు