chocolate biryani: చాక్లెట్‌ బిర్యానీ రుచి చూస్తారా!
close

Published : 29/07/2021 23:41 IST
chocolate biryani: చాక్లెట్‌ బిర్యానీ రుచి చూస్తారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆవకాయ్‌ బిర్యానీ.. ఉలవచారు బిర్యానీ గురించి వినే ఉంటారు. రుచి కూడా చూసే ఉంటారు కదా! మరి చాక్లెట్‌ బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా? చాక్లెట్‌తో బిర్యానీయా..? అదేం కాంబినేషన్‌రా బాబోయ్‌ అనుకుంటున్నారా! అవునండీ పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ చాక్లెట్‌ బిర్యానీ లభిస్తోంది. అక్కడి ‘ఎఫ్‌హెచ్‌ఎం పాకిస్థాన్‌’ అనే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కరాచీలోని ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌లో తయారు చేస్తున్న ఈ స్పెషల్‌ చాక్లెట్‌ బిర్యానీపై వీడియో చేసి పోస్టు చేసింది. అందులో ఫుడ్‌స్టాల్‌ వ్యక్తి ప్లేట్‌లో బిర్యానీ తీసుకొచ్చి దాంట్లో ఒక కప్పు చాక్లెట్‌ను కలిపేశాడు. అదే చాక్లెట్‌ బిర్యానీ అట. దాన్ని తిన్న యూట్యూబర్‌ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ విచిత్రమైన కాంబినేషన్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని