Viral: ఎస్సై సాహసం.. వ్యక్తి ప్రాణాలు సురక్షితం
close

Published : 22/06/2021 00:01 IST
Viral: ఎస్సై సాహసం.. వ్యక్తి ప్రాణాలు సురక్షితం

అలీగఢ్‌: ప్రమాదవశాత్తూ కాలువలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి. అలీగఢ్‌లోని ఓ కాలువ వద్ద ఎస్సై అశీష్ కుమార్ విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా కాలువలో ఎవరో పడిన శబ్ధం వినిపించింది. భారీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించిన అశీష్ వెంటనే కాలువలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అశీష్ కుమార్ సాహసాన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీయగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విధి నిర్వహణ పట్ల ఎస్సై ఆశీష్‌ కుమార్‌ చూపిన అంకితభావాన్ని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని