
ఇంటర్నెట్ డెస్క్: ఆమె చక్కగా నీలం రంగు చీర కట్టుకుంది.. ఆయనేమో చక్కటి పంచెకట్టుతో తయారయ్యాడు. ఇంతకీ వారెందుకు ఇంత సంప్రదాయ బద్ధంగా ముస్తాబయ్యారంటే..
దివ్య మయ్యా, మధు ఆమెరికాలో నివసిస్తున్న భారతీయులు. వీరు మంచులో జారే క్రీడ స్కీయింగ్‌కు సంబంధించిన వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ చేసేదేదో అందరూ చూసింది, సాధారణమైనది కాకుండా కాస్త నేటివ్ టచ్ ఇవ్వాలనీ అనుకున్నారు. ఈ క్రమంలో దివ్య భారతీయ సంప్రదాయ ప్రకారం చీర కట్టుకోగా, మధు పంచె ధరించి మరీ మంచులో దూసుకుపోయారు. దృష్టి మరల్చుకునేందుకు ఏదైనా కాస్త క్రేజీగా చేద్దామనే ఆలోచనతో ఇలా చేశామని దివ్య అన్నారు.
స్కీయింగ్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదముంది. మరి అంత కష్టమైన ఆటను సంప్రదాయ దుస్తుల్లో ఆడాలన్న వీరి ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భలేగా చేశారే అంటూ కామెంట్లు పెడుతున్నారు.. తాము కూడా వారిలాగే ట్రై చేస్తామంటున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ వీడియో విశేషమేంటో మీరూ చూడండి!
ఇవీ చూడండి..
మియన్మార్: తెలీకుండానే భలే తీసిందే!
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్