Viral Video: క్రియేటివిటీ అదిరింది!
close

Published : 20/06/2021 00:29 IST
Viral Video: క్రియేటివిటీ అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వారం ప్రారంభంలో వైరల్‌గా మారిన రొనాల్డో ప్రెస్‌మీట్‌ వీడియో తాజాగా మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టీవీ తెరపై రొనాల్డోకి సంబంధించిన ప్రెస్‌మీట్‌ వీడియో ప్లే అవుతుండగా ఒక వ్యక్తి అతడి చెవుల్లో ఏదో చెబుతున్నట్టు నటించాడు.  రొనాల్డో టేబుల్‌ మీద ఉన్న కూల్‌డ్రింక్‌ బాటిళ్లను పక్కన పెట్టే సమయానికి ఆ వ్యక్తి టీవీ వెనక నుంచి రెండు డ్రింక్‌ బాటిళ్లను తీశాడు. రొనాల్డో అలా పక్కన పెట్టిన బాటిళ్లను ఆ వ్యక్తి అందుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అద్యంతం సరదాగా సాగే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

కాగా యూరో 2020 టోర్నమెంట్‌లో హంగరీ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు పోర్చ్‌గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లలో భాగంగా టోర్నీ స్పాన్సరర్‌ కోకకోలాకు చెందిన రెండు కూల్‌డ్రింక్‌ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండే రొనాల్డో ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్‌బాటిల్‌ను అందుకొని ‘మంచి నీళ్లు తాగండి’ అని వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతూ వస్తోంది. 

రొనాల్డో చాలా సాధారణంగానే కోకకోలా డ్రింక్‌ బాటిళ్లను పక్కను పెట్టినా.. అది ఆ కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దాంతో కోకకోలా సంస్థ రూ.29 వేల కోట్ల రూపాయల విలువైన సంపదను నష్టపోయింది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోను ఫెవికాల్‌ సంస్థ తన కంపెనీ వాణిజ్య ప్రకటనకు అనుకూలంగా మలచుకుంది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ టేబుల్‌పై కోక్‌ బాటిళ్ల బదులు రెండు ఫెవికాల్‌ బాటిళ్లను ఉంచి.. ‘దీన్నెవరూ జరపలేరు.. విలువ పడిపోదు’ అనే వ్యాఖ్యను జోడించింది. దీంతో ఫెవికాల్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని