ఈ పులి- ఏనుగు వీడియో చూశారా?
close

Published : 01/06/2021 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ పులి- ఏనుగు వీడియో చూశారా?

అడవిలో రౌద్రానికి చిరునామా పులి. ఏదైనా జంతువుపై దాని కన్ను పడిందంటే చాలు.. దాని చేతికి చిక్కాక చుక్కలు చూడాల్సిందే. అంతలా వేటాడేస్తుంది. అలాంటి పులి ఇక్కడ పిల్లిలా ప్రవర్తించింది. తన వెనుక నుంచి వస్తున్న ఏనుగుపై దాడి చేయడానికి లేదా పోట్లాటకి యత్నించకుండా పక్కకు తప్పుకుంది. నమ్మశక్యంగా లేని ఈ ఘటనని నటి, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త దియా మీర్జా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 21 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. అడవిలోని మార్గం మధ్యలో పులి అలా సేద తీరుతుండగా, దాని వెనుక నుంచి ఒక ఏనుగు వస్తుంటుంది. పులి ఎగిరి దాడి చేస్తుందని అనుకునేలోపే.. గజరాజుతో జగడమెందుకని పక్కకు తప్పుకుంది. పొదల్లోకి వెళ్లిపోయి ఏనుగు నడిచేందుకు దారి ఇచ్చింది. వేటాడేస్తుందని అనుకునేలోపే ఎవరూ ఊహించని విధంగా పక్కకు తప్పుకున్న ఈ వీడియోని ప్రస్తుతం లక్ష మంది వరకూ వీక్షించగా, ప్రవీణ్‌ కాస్వాన్‌ అనే భారతీయ అటవీ శాఖాధికారి ‘‘నేనెప్పుడూ చెబుతున్నట్టు అడవికి రారాజు ఏనుగే. అదే కింగ్‌. దానికి ఎదురు నిలిచేవారే లేరు’’ అంటూ కామెంట్‌ పెట్టగా.. మరొకరు ‘‘శాంతిమార్గానికి ఇదే అసలైన నిర్వచనం. మన మనుషుల్లా అధికారంతో, అహంకారంతో కొట్టుకోవు’’ అని కామెంట్లలో రాసుకొచ్చారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు