Viral Video: వంటింట్లోకి వచ్చిన ఏనుగు
close

Published : 24/06/2021 23:48 IST
Viral Video: వంటింట్లోకి వచ్చిన ఏనుగు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమయం తెల్లవారుజామున 2 గంటలు కావస్తోంది. వంటగదిలో ఏదో చప్పుడు వినిపించడంతో ఓ గృహిణి  వెళ్లి చూసింది. కిచెన్‌లోకి తలదూర్చి అందిన వాటిని లాక్కుని తింటున్న ఏనుగును చూసే సరికి ఆమెకు నిద్ర మత్తు వదిలిపోయింది. కుటుంబ సభ్యులంతా వంటగదిలో ఉన్న ఏనుగును చూసి అవాక్కయ్యారు. ఇదేదో కథలా ఉందని అనుకుంటున్నారా! కానేకాదు.. థాయ్‌ల్యాండ్‌లో జరిగిన యధార్థ సంఘటన. 

జూన్‌ 20న థాయ్‌ల్యాండ్‌లోని హువా హిన్‌ ప్రాంతంలో ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలోని కేంగ్‌ క్రాచాన్‌ జాతీయ ఉద్యానవనంలో ఉండే ఏనుగు తరచుగా గ్రామంలోని మార్కెట్‌కు వచ్చి కావలసినవి తిని వెళ్లిపోతుంటుంది. అయితే ఈ సారి గ్రామంలోకి వచ్చిన ఏనుగు ఓ ఇంటిని ధ్వంసం చేసింది. ఆ ఇంటి వంటగది గోడను పగులగొట్టి లోపలున్న వాటిని తినేసింది. కాగా ఏనుగు చేసిన పనివల్ల ఇల్లు చాలా వరకు దెబ్బతిన్నది. మరమ్మతులు చేసుకోవడానికి రూ1.16 లక్షల వరకు అవుతుందని ఇంటి యజమాని వాపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని