Viral Video: ఒళ్లు గగురుపొడిచే రోడ్డు ప్రమాదం.. బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు!
close

Published : 27/07/2021 18:50 IST
Viral Video: ఒళ్లు గగురుపొడిచే రోడ్డు ప్రమాదం.. బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులో ఒక డ్రైవర్‌ అతివేగంతో వాహనాన్ని నడపడం ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. అడ్డూ, అదుపు లేకుండా లగ్జరీ కారులో మెరుపు వేగంతో దూసుకొచ్చిన వ్యక్తి ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డారు. వారికి ఏమైందోనని కూడా చూడకుండా కారులోని వ్యక్తి అదే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కారును గుర్తించారు. గాయపడిన ఇద్దరు యువకులను సేలం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని