Viral Video: డబ్బు ఇలా మాత్రం ఖర్చు చేయొద్దు..!
close

Published : 20/07/2021 23:47 IST
Viral Video: డబ్బు ఇలా మాత్రం ఖర్చు చేయొద్దు..!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్ర సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో పలు అంశాలపై ఆయన నెట్టింట సందడి చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఆయన షేర్‌ చేసిన వీడియో నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బంగారం పూత పూసిన ఫెరారీ కారులో ఓ భారత-అమెరికన్‌ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు. ఆక్కడున్న వారంతా ఆ కారును తదేకంగా చూస్తూ ఉండిపోయారు.

అయితే ట్విటర్‌లో ఆ వీడియో అంతగా ఎందుకు వైరల్‌ అవుతోందో అర్థం కావడంలేదని ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా డబ్బు ఎలా ఖర్చు చేయకూడదో ఆ కారు యజమానిని చూసి నేర్చుకోవాలంటూ ట్వీట్‌ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. ట్విటర్‌లో ఆయన పోస్టును 24 గంటల్లోనే 1,69,300 మంది వీక్షించారు. 6 వేల మందికిపైగా లైక్‌ చేశారు. పలువురు నెటిజన్లు సైతం ఆనంద్‌ మహీంద్ర అభిప్రాయంతో ఏకీభవిస్తూ పోస్టులు పెట్టారు. ఈ వీడియోతో బంగారంపై భారతీయులకు  ఎంత మక్కువో తెలుస్తోందంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశారు. ఇలా సరదా కామెంట్లతో పలువురు ఆ వీడియోపై స్పందించారు. 

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని