Viral Video: ఒక్కపెట్టున కూలిన భారీ టవర్లు..
close

Published : 09/06/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Viral Video: ఒక్కపెట్టున కూలిన భారీ టవర్లు..

లండన్‌: భారీ పరిమాణంలో ఉన్న నాలుగు కూలింగ్ టవర్లు ఒక్కపెట్టున కూలిపోయాయి. దట్టమైన దుమ్ము, పొగ వెదజల్లుతూ.. చిన్న ముక్కలుగా మారిపోయాయి. గత వారాంతంలో రూగిలే పవర్‌ స్టేషన్‌లో కనిపించిన ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ బొగ్గు ఆధారిత పవర్‌ స్టేషన్ ఇంగ్లండ్‌లోని స్టాఫర్డ్‌షైర్‌లో ఉంది. ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఆ ప్లాంట్‌లో 2016 నుంచి కార్యకలాపాలను నిలిపివేశారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి, వ్యాపార సముదాయాల ఏర్పాటు కోసం 117 మీటర్ల ఎత్తున్న ఈ కూలింగ్ టవర్లను పేల్చేశారు. ఆ ప్రాంతంలో 2,300 ‘లో కార్బన్’ ఇళ్లతో పాటు, పాఠశాలను నిర్మించనున్నారు.

కొవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. ఈ కూల్చివేత పక్రియను వీక్షించేందుకు భారీ సంఖ్యలో స్థానికులు గుమిగూడారు. నియంత్రిత వాతావరణంలో ఒకేసారి ఈ నాలుగు టవర్లను కూల్చివేసేందుకు నెలలపాటు సన్నద్ధమయినట్లు బ్రౌన్ అండ్ మాసన్ గ్రూప్ వెల్లడించింది. అలాగే వేరు వేరు కోణాల్లో తీసిన వీడియోను పంచుకుంది. అది నెటిజన్లను అబ్బుపరుస్తోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు